ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلوگوى - عبدالرحيم بن محمد

external-link copy
93 : 3

كُلُّ الطَّعَامِ كَانَ حِلًّا لِّبَنِیْۤ اِسْرَآءِیْلَ اِلَّا مَا حَرَّمَ اِسْرَآءِیْلُ عَلٰی نَفْسِهٖ مِنْ قَبْلِ اَنْ تُنَزَّلَ التَّوْرٰىةُ ؕ— قُلْ فَاْتُوْا بِالتَّوْرٰىةِ فَاتْلُوْهَاۤ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

ఆహార పదార్థాలన్నీ ఇస్రాయీల్ సంతతివారికి ధర్మసమ్మతమైనవిగానే ఉండేవి. కాని, తౌరాత్ అవతరణకు పూర్వం ఇస్రాయీల్ (యఅఖూబ్) తనకు తాను కొన్ని వస్తువులను నిషేధించుకున్నాడు. వారితో ఇట్లను: "మీరు సత్యవంతులే అయితే, తౌరాత్ ను తీసుకొని రండి మరియు దానిని చదవండి." [1] info

[1] ఇబ్రాహీమ్ ('అ.స.) ధర్మంలో ఒంటె మాంసం మరియు దాని పాలు 'హరాం కావు. కాని ఇస్రాయీ'ల్ (య'అఖూబ్ 'అ.స.) తానే స్వయంగా వీటిని 'హరాం చేసుకున్నాడు. తౌరాత్ మూసా ('అ.స.) పై అవతరింపజేయబడింది. అది య'అఖూబ్ ('అ.స.) గతించిన ఎన్నో సంవత్సరాల తర్వాత అవతరింపజేయబడింది. కావున ఇక్కడ అల్లాహ్ (సు.తా.) ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. మరియు తౌరాత్ లో 'హరాం చేయబడిన వస్తువులు, యూదులు చేసిన దుర్మార్గాలకు ఫలితంగా 'హరాం చేయబడ్డాయి. అవి ఇబ్రాహీం ('అ.స.) కాలంలో 'హరాం చేయబడలేదు. చూడండి, 4:160 మరియు 6:146, (అయ్ సర్ అత్ - తఫాసీర్).

التفاسير: