ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلوگوى - عبدالرحيم بن محمد

external-link copy
29 : 22

ثُمَّ لْیَقْضُوْا تَفَثَهُمْ وَلْیُوْفُوْا نُذُوْرَهُمْ وَلْیَطَّوَّفُوْا بِالْبَیْتِ الْعَتِیْقِ ۟

తరువాత వారు హజ్జ్ ఆచారాలు[1] (తఫస్) మరియు మొక్కుబడులు (నుజుర్) పూర్తి చేసుకొనిన పిదప ఆ ప్రాచీన గృహం (కఅబహ్) యొక్క ప్రదక్షిణ చేయాలి.[2] info

[1] అంటే 10వ జు'ల్-'హజ్ న చివరి షై'తైన్ (జమరతుల్ 'అఖబహ్)కు - ఏదైతే మక్కా వైపు ఉందో - ఏడు రవ్వలు రువ్వి, ఖుర్బానీ చేసి, తలవెంట్రుకలను కత్తిరించుకుంటే, అది త'హ్లీలె అవ్వల్ లేక చిన్న 'హలాల్ అవుతుంది. అంటే ఇ'బ్రాహీమ్ నిషేధాలన్నీ ముగిసిపోతాయి. కాని 'తవాఫ్ ఇఫాదా ('జ్యారహ్) చేసే వరకు భార్యతో సంభోగం చేయడం నిషిద్ధం. [2] 'తవాఫె 'జ్యారహ్ : ఇది విధి, తప్పక చేయవలసింది. ఇది 'అరఫాత్ నుండి బయలు దేరి 9-10 తేదీల మధ్య రాత్రి ము'జ్ దలిఫాలో గడిపి 10వ తేదీ ఉదయం చివరి షై'తాన్ (జమరతుల్ 'అఖబహ్) కు ఏడు రవ్వలు రువ్వి, 'ఖుర్బానీ ఇచ్చి తలవెంట్రుకలు కత్తిరించుకొని, ఇ'హ్రామ్ విడిచిన తరువాత మక్కాకు పోయి క'అబహ్ గృహం చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయటం. ఇది 10,11,12 జు'ల్-'హజ్ తేదీలలో పూర్తి చేయాలి. దీని తరువాత భార్యతో సంభోగం చేయవచ్చు. ఇది చివరి 'హలాల్. వివరాలకు చూడండి, 2:196-197.

التفاسير: