ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلوگوى - عبدالرحيم بن محمد

external-link copy
101 : 17

وَلَقَدْ اٰتَیْنَا مُوْسٰی تِسْعَ اٰیٰتٍۢ بَیِّنٰتٍ فَسْـَٔلْ بَنِیْۤ اِسْرَآءِیْلَ اِذْ جَآءَهُمْ فَقَالَ لَهٗ فِرْعَوْنُ اِنِّیْ لَاَظُنُّكَ یٰمُوْسٰی مَسْحُوْرًا ۟

మరియు మేము వాస్తవానికి, మూసాకు స్పష్టమైన తొమ్మిది అద్భుత సూచనలను ప్రసాదించాము.[1] ఇస్రాయీల్ సంతతి వారిని అడుగు, అతను (మూసా) వారి వద్దకు వచ్చినపుడు ఫిరఔన్ అతనితో అన్నాడు: "ఓ మూసా! నిశ్చయంగా, నీవు మంత్రజాలానికి గురి అయ్యావని నేను భావిస్తున్నాను." info

[1] మూసా ('అ.స.) కు ఇవ్వబడిన (ఫిర్'ఔన్ జాతి వారికి చూపిన) తొమ్మిది అద్భుత సూచనలు: 1) ప్రకాశించే చేయి, 2) సర్పంగా మారే చేతి కర్ర, 3) దుష్టులకు కలిగిన కరువు మరియు ఫల నష్టము, 4) 'తుఫాను, 5) మిడుతల దండు, 6) పేనులు, 7) కప్పలు, 8) రక్తం మరియు 9) సముద్రంలో ఏర్పడిన బాట. ఇవి సూరహ్ అల్-అ'అరాఫ్ (7) లో కూడా వివరించబడ్డాయి. ఇబ్నె'అబ్బాస్, ముజాహిద్, ఇక్రిమా, షాబీ, ఖతద ర'ది. 'అన్హుమ్ ల వ్యాఖ్యానం, (ఇబ్నె-క'సీర్). ఇవేగాక బండ నుండి తీసిన 12 ఊటలూ, మన్న మరియు సల్వాలు కూడా అద్భుత సూచనలే, కానీ వీటిని ఫిర'ఔన్ జాతి వారు చూడలేదు.

التفاسير: