[1] ఒక జుము'అహ్ రోజున దైవప్రవక్త ('స'అస) జుము'అహ్ ఉపన్యాసం (ఖుత్బా) ఇస్తుంటారు. అప్పుడు ఒక వ్యాపార బృందం మదీనాలో ప్రవేశిస్తుంది. అప్పుడు ఖుత్బా వింటున్న వారిలో నుండి చాలా మంది ఉపన్యాసాన్ని వదలి, వస్తువులు అయిపోక ముందే త్వరగా కొనుక్కుందాం అనే పేరాశతో వెళ్ళిపోతారు. కేవలం 12 మంది మాత్రమే మస్జిదులో మిగిలి పోతారు. అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడింది. చూడండి, 15:23.