[1] 'హుదైబియా సంధి అయిన కొన్ని రోజుల తరువాత మక్కా ముష్రిక్ లు దానిని ఉల్లంఘిస్తారు. దానికి దైవప్రవక్త ('స'అస) రహస్యంగా యుద్ధసన్నాహాలు ప్రారంభిస్తారు. 'హా'తిబ్ బిన్ అబీ బల్త్అ (ర.'ది.'అ.) అనే బదరీ 'స'హాబి ఈ విషయాన్ని ఒక పత్రం మీద వ్రాసి మక్కాకు పోయే ఒక స్త్రీకి ఇస్తాడు. ఈ విషయం దైవప్రవక్త ('స'అస) కు వహీ ద్వారా తెలుస్తుంది. అతను ('స'అస) అలీ, ముఖ్దాద్ మరియు 'జుబైర్ (ర'ది.'అన్హుమ్)లతో: రవ్'దయే'ఖా'ఖ్, దగ్గర ఒక స్త్రీ ఉంది. ఆమె దగ్గర ఒక ఉత్తరం ఉంది. దానిని తీసుకురండి!' అని పంపుతారు. వారు ఆ ఉత్తరాన్ని ఆమె తల వెంట్రుకల నుండి తీయించి తెస్తారు. 'హా'తిబ్ (ర'ది.'అ.) ను ప్రశ్నించగా: 'నేను ఖురైషును కాను. నా భార్యాపిల్లలు మక్కాలో నిస్సహాయులుగా ఉన్నారు. నేను ఖురైషులకు ఈ వార్త ఇస్తే వారు నా భార్యాపిల్లల పట్ల కనికరులుగా ఉంటారని ఇలా చేశాను.' అని అంటాడు. దైవప్రవక్త ('స'అస) అతని సత్యాన్ని తెలుసుకొని అతనిని క్షమిస్తారు. ఆ సందర్భంలో ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ('స.'బుఖారీ, 'స.ముస్లిం).
[1] అంటే తమ చేష్టలతో మరియు మాటలతో మిమ్మల్ని వేధిస్తారు.
[1] చూడండి, 80:34.
[1] కాని అతని తండ్రి ముష్రిక్ గా మరణించిన తరువాత ఇబ్రాహీమ్ ('అ.స.) తన తండ్రితో సంబంధం తెంపుకున్నాడు. చూడండి, 9:114 మరియు చూడండి, 195:47-48.
[2] తవక్కల్: అంటే వీలైనంత వరకు ప్రయత్నం చేసి, ఆ తరువాత అల్లాహ్ (సు.తా.) పై నమ్మకం ఉంచుకొని, అల్లాహ్ (సు.తా.)పై ఆధారపడాలి. అలా చేయకుండా అల్లాహ్ (సు.తా.) పైన మాత్రమే ఆధారపడి ఉంటామనడం తగినది కాదు. దైవప్రవక్త ('స'అస) దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు. అతడు తన ఒంటెను బయటవిడిచి లోపలికి వెళ్తాడు. దైవప్రవక్త ('స'అస) అడగ్గా ఇలా అంటాడు: 'నేను ఒంటెను అల్లాహ్ కు అప్పగించి వచ్చాను.' దైవప్రవక్త ('స'అస) అంటారు: 'ఇది తవక్కల్ కాదు. మొదట దానిని కట్టి ఉంచు తరువాత అల్లాహ్ (సు.తా.) పై ఆధారపడు!' (తిర్మిజీ')
[1] ఇటువంటి ఆయత్ కు చూడండి, 10:85.
[1] చూడండి, 33:21.
[1] ఎలాంటి సత్యతిరస్కారులతో సత్ప్రవర్తనతో వ్యవహరించాలో వారి వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఒకటి: మీరు కేవలం ముస్లింలు అయినందుకు మీతో శత్రుత్వం వహించి మీతో పోరాడని వారితో, రెండు: మిమ్మల్ని మీ ఇల్లూ వాకిలి విడిచి పొమ్మని బవలంతం చేయని వారితో! మూడు: మీకు విరుద్ధంగా ఇతర సత్యతిరస్కారులకు సహాయపడని వారితో!
[2] చూదైవప్రవక్త ('స'అస) ను అస్మా బిన్తె అబూ బక్ర్ సిద్ధీఖ్ (ర'అన్హా), ముష్రిక్ రాలైన తన తల్లితో ఎలా వ్యవహరించాలని అడిగారు. అతను ('స'అస) ఇలా జవాబిచ్చారు: 'నీ తల్లితో రక్త సంబంధాన్ని ఉంచుకో!' ('స'హీ 'హ్ ముస్లిం, 'స'హీ 'హ్ బు'ఖారీ) మరొక విషయం ఏమిటంటే బంధువులు కాని సత్యతిరస్కారులతో కూడ న్యాయంగా ప్రవర్తించాలి.
[1] చూడండి, 5:51.
[1] 6వ హిజ్రీలో జరిగిన 'హుదైబియా ఒప్పందంలో ఏ వ్యక్తి అయినా మక్కా నుండి మదీనాకు వెళ్ళపోతే ఆ వ్యక్తిని మక్కావారు - తిరిగి ఇవ్వమని అడిగితే - ఇవ్వాలి అనే షర్త్ ఉండింది. కాని అందులో స్త్రీపురుషుల విషయం స్పష్టంగా లేదు. దానిని బట్టి ముస్లింయి మదీనాకు వచ్చిన స్త్రీలను వాపసు ఇవ్వండి అని మక్కా ముష్రిక్ లు కోరగా, ఈ ఆయత్ అవతరింప జేయబడింది. వారు కేవలం ఇస్లాం కొరకే వచ్చారని నిర్ధారణ చేసుకోవాలని ఆజ్ఞ ఉంది. యుక్త వయస్కుడైన పురుషునికి లేక స్త్రీకి తనకు నచ్చిన ధర్మాన్ని అనుసరించే హక్కు ఉంది. ఈ ఆయత్ అవతరించక ముందు చాలా మంది ముస్లింల భర్తలు లేక భార్యలు ముష్రికులుగా ఉండేవారు. ఉదాహరణకు దైవప్రవక్త ('స'అస) బిడ్డ 'జైనబ్ (ర. 'అన్హా) భర్త అబుల్ 'ఆ'స్ బిన్ రబీ'అ, ముష్రిక్ గా ఉండేవారు. అతను బద్ర్ యుద్ధపు కొంత కాలం తరువాత ఇస్లాం స్వీకరించి మదీనాకు వచ్చారు.
[2] 'ఉమర్ (ర'ది.'అ.) గారి ఇద్దరు భార్యలు ముష్రికులు. ఈ ఆయత్ అవతరణ తరువాత అతను వారికి విడాకులిచ్చారు.
[3] ఒక స్త్రీ ఇస్లాం స్వీకరించగానే ఆమె ముష్రిక్ భర్తతో ఆమె వివాహబంధం వెంటనే తెగిపోతుంది. అతడు ఆమె నుండి తన మహ్ర్ వాపసు తీసుకోవచ్చు.
[1] 'ఆఖబ్ తుమ్ (దీని మరొక వ్యాఖ్యానం) : ప్రతీకారం తీసుకునే అవకాశం దొరికితే అంటే, ముష్రికుల భార్యలు కూడా ముస్లింలై, ముస్లింల దగ్గరికి వస్తే వారి - ఆ ముస్లిం అయిన స్త్రీల - మహ్ర్ వారి మొదటి ముష్రిక్ భర్తలకు చెల్లించక, దాని నుండి ఏ ముస్లింల భార్యలైతే ముష్రికులై వెళ్ళిపోయారో ఆ పురుషులకు చెల్లించాలి.
[1] చూఈ విధమైన ప్రమాణం దైవప్రవక్త ('స'అస) ఇస్లాం స్వీకరించి, ముష్రికులను వదలి వచ్చే స్త్రీల చేత చేయించే వారు. మరియు 8వ హిజ్రీలో మక్కా విజయం తరువాత కూడా చేయించారు. కానీ శపథం చేయించేటప్పుడు దైవప్రవక్త ఏ స్త్రీని కూడా ముట్టుకోలేదు అంటే చేతిపై చేయి పెట్టి ప్రమాణం చేయించలేదు, కేవలం వారి నోటితో మాత్రమే ప్రమాణం చేయించారు! ('స'హీ'హ్ బు'ఖారీ - 'ఆయి'షహ్ (ర.'అన్హా) కథనం).
[1] చూడండి, 58.14