[1] ఈలాఫున్: ఖురైషుల ముఖ్య వృత్తి వ్యాపారం వారు సీతాకాలంలో యమన్ కు మరియు వేసవి కాలంలో సిరియాకు వ్యాపారానికి పోయేవారు. వారు కా'బా నిర్వాహకులు కావటం వల్ల వారి వాణిజ్య బృందాలు ఎలాంటి ఆటంకం, అపాయం లేకుండా ప్రయాణం చేయగలిగేవి.
[1] వారిని ప్రమాదం నుండి కాపాడేవాడు మరియు వారిని పోషించేవాడు కేవలం అల్లాహ్ (సు.తా.) మాత్రమే కానీ - వారు పూజించే నిస్సహాయులైన - విగ్రహాలు గానీ, ఇతర కల్పిత దైవాలు గానీ కావు. గనుక వారు వాటి ఆరాధనను మానుకోవాలి. ఇంకా చూడండి, 2:126.