വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ

പേജ് നമ്പർ: 431:428 close

external-link copy
32 : 34

قَالَ الَّذِیْنَ اسْتَكْبَرُوْا لِلَّذِیْنَ اسْتُضْعِفُوْۤا اَنَحْنُ صَدَدْنٰكُمْ عَنِ الْهُدٰی بَعْدَ اِذْ جَآءَكُمْ بَلْ كُنْتُمْ مُّجْرِمِیْنَ ۟

అనుసరించబడిన వారు ఎవరైతే సత్యము నుండి అహంకారమును చూపినారో వారు అనుసరించేవారు ఎవరినైతే వారు బలహీనులుగా భావించేవారో వారితో ఇలా అంటారు : ఏమీ ముహమ్మద్ మీ వద్దకు తీసుకుని వచ్చిన సన్మార్గము నుండి మేము మిమ్మల్ని ఆపామా ?. అలా కాదే . కానీ మీరు దుర్మార్గులు,చెడును ప్రభలింపజేసే చెడ్డవారు. info
التفاسير:

external-link copy
33 : 34

وَقَالَ الَّذِیْنَ اسْتُضْعِفُوْا لِلَّذِیْنَ اسْتَكْبَرُوْا بَلْ مَكْرُ الَّیْلِ وَالنَّهَارِ اِذْ تَاْمُرُوْنَنَاۤ اَنْ نَّكْفُرَ بِاللّٰهِ وَنَجْعَلَ لَهٗۤ اَنْدَادًا ؕ— وَاَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَاَوُا الْعَذَابَ ؕ— وَجَعَلْنَا الْاَغْلٰلَ فِیْۤ اَعْنَاقِ الَّذِیْنَ كَفَرُوْا ؕ— هَلْ یُجْزَوْنَ اِلَّا مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟

మరియు ఆ అనుసరించేవారు ఎవరినైతే వారి నాయకులు బలహీనులుగా భావించేవారో వారు సత్యము నుండి అహంకారమును చూపిన తాము అనుసరించేవారితో ఇలా పలుకుతారు : రాత్రింబవళ్ళు మీ కుట్రలు ఎప్పుడైతే మీరు మమ్మల్ని అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచమని,ఆయనను వదిలి సృష్టితాలను ఆరాధించమని ఆదేశించేవారో మమ్మల్ని సన్మార్గము నుండి ఆపినాయి. వారు శిక్షను చూసి,తాము శిక్షించబడుతారని తెలుసుకున్నప్పుడు తాము ఇహలోకములో పాల్పడిన అవిశ్వాసముపై కలిగిన అవమానమును దాచివేస్తారు. మరియు మేము అవిశ్వాసపరుల మెడలలో సంకెళ్ళను వేస్తాము. వారు ఇహలోకములో అల్లాహ్ ను వదిలి ఇతరుల ఆరాధనచేయటం,పాపాలకు పాల్పడటం ఏదైతే చేశారో దానికి ప్రతిఫలంగా మాత్రమే వారు ఈ ప్రతిఫలమును ప్రసాదించబడుతారు. info
التفاسير:

external-link copy
34 : 34

وَمَاۤ اَرْسَلْنَا فِیْ قَرْیَةٍ مِّنْ نَّذِیْرٍ اِلَّا قَالَ مُتْرَفُوْهَاۤ اِنَّا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ كٰفِرُوْنَ ۟

మరియు మేము బస్తీల్లోంచి ఏ బస్తీలో ప్రవక్తను పంపిస్తే అతడు వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టేవాడు. కాని అందులో ఉన్న అధికారము,మర్యాద,సంపద కల ఐశ్వర్య వంతులు ఇలా పలికేవారు : ఓ ప్రవక్తలు నిశ్ఛయంగా మేము మీరు ఇచ్చి పంపించబడిన వాటిని తిరస్కరిస్తున్నాము. info
التفاسير:

external-link copy
35 : 34

وَقَالُوْا نَحْنُ اَكْثَرُ اَمْوَالًا وَّاَوْلَادًا ۙ— وَّمَا نَحْنُ بِمُعَذَّبِیْنَ ۟

మరియు ఉన్నతులైన వీరందరు గర్వపడతూ,అహంకారపడుతూ ఇలా పలికారు : మేము ఎక్కువ సంపద,ఎక్కువ సంతానము కలిగినవారము. మేము శిక్షింపబడుతామని మీరు అనుకుంటున్నది అసత్యము. మేము ఇహలోకములో,పరలోకములో శిక్షంపబడము. info
التفاسير:

external-link copy
36 : 34

قُلْ اِنَّ رَبِّیْ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ وَیَقْدِرُ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟۠

ఓ ప్రవక్తా మీరు తమకు ఇవ్వబడిన అనుగ్రహాలపై అహంకారమునకు లోనయ్యే వీరందరితో ఇలా పలకండి : పరిశుద్ధుడైన,మహోన్నతుడైన నా ప్రభువు తాను కోరుకున్న వాడి కొరకు ఆహారోపాధిని అతడు కృతజ్ఞత తెలుపుకుంటాడా లేదా కృఘ్నుడవుతాడా పరీక్షించటానికి విస్తృతపరుస్తాడు. మరియు తాను కోరుకున్న వారిపై దాన్ని అతడు సహనం వహిస్తాడా లేదా క్రోధానికి గురవుతాడా పరీక్షించటానికి కుదించివేస్తాడు. కానీ చాలా మంది ప్రజలకు అల్లాహ్ విజ్ఞత కలవాడని తెలియదు. ఆయన ఏదైన విషయాన్ని పూర్తి విజ్ఞతతో మాత్రమే అంచనా వేస్తాడు. దాన్ని తెలుసుకునేవాడు తెలుసుకుంటాడు మరియు దాన్ని తెలిసికోని వాడు తెలియకుండా ఉంటాడు. info
التفاسير:

external-link copy
37 : 34

وَمَاۤ اَمْوَالُكُمْ وَلَاۤ اَوْلَادُكُمْ بِالَّتِیْ تُقَرِّبُكُمْ عِنْدَنَا زُلْفٰۤی اِلَّا مَنْ اٰمَنَ وَعَمِلَ صَالِحًا ؗ— فَاُولٰٓىِٕكَ لَهُمْ جَزَآءُ الضِّعْفِ بِمَا عَمِلُوْا وَهُمْ فِی الْغُرُفٰتِ اٰمِنُوْنَ ۟

మరియు మీరు గర్వపడే మీ సంపదలు,మీ సంతానము మిమ్మల్ని అల్లాహ్ మన్నత వైపునకు తీసుకునిపోవు. కాని ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి సత్కార్యములు చేస్తాడో వాడు రెట్టంపు పుణ్యాన్ని పొందుతాడు. అప్పుడు సంపదలు అల్లాహ్ మార్గములో వాటిని ఖర్చు చేయటం వలన,సంతానము అతని కొరకు వారు దుఆ చేయటం వలన అతనికి దగ్గర చేస్తాయి. వారందరు సత్కార్యములను చేసే విశ్వాసపరులు వారి కొరకు వారు చేసిన కర్మలకు రెట్టింపు పుణ్యం ఉంటుంది. మరియు వారు స్వర్గములోని ఉన్నత స్థానములలో తాము భయపడే శిక్ష,మరణం,అనుగ్రహాలు అంతం అయిపోవటం నుండి నిశ్ఛింతగా ఉంటారు. info
التفاسير:

external-link copy
38 : 34

وَالَّذِیْنَ یَسْعَوْنَ فِیْۤ اٰیٰتِنَا مُعٰجِزِیْنَ اُولٰٓىِٕكَ فِی الْعَذَابِ مُحْضَرُوْنَ ۟

మరియు మా ఆయతుల నుండి ప్రజలను మరలించటంలో శాయాశక్తుల కృషి చేసి,తమ లక్ష్యాలను సాధించటానికి ప్రయత్నం చేసే అవిశ్వాసపరులు వీరందరు ఇహలోకములో నష్టమును చవిచూస్తారు,పరలోకములో శిక్షింపబడుతారు. info
التفاسير:

external-link copy
39 : 34

قُلْ اِنَّ رَبِّیْ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ وَیَقْدِرُ لَهٗ ؕ— وَمَاۤ اَنْفَقْتُمْ مِّنْ شَیْءٍ فَهُوَ یُخْلِفُهٗ ۚ— وَهُوَ خَیْرُ الرّٰزِقِیْنَ ۟

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్చయంగా పరిశుద్ధుడైన,మహోన్నతుడైన నా ప్రభువు తన దాసుల్లోంచి తాను కోరుకున్న వారికి ఆహారోపాధిని విస్తరింపజేస్తాడు మరియు వారిలో నుంచి తాను కోరుకున్న వారిపై దాన్ని కుదించివేస్తాడు. మరియు అల్లాహ్ మార్గంలో మీరు ఏదైన ఖర్చు చేస్తే పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ దాని కన్న మేలైన దాన్ని, పరలోకములో గొప్ప పుణ్యమును మీకు ఇచ్చి ఇహలోకములో మీపై దాన్ని రెట్టింపు చేసి ఇస్తాడు. మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ అందరికన్న ఉత్తమ ఆహారప్రధాత. అయితే ఎవరైతే ఆహారమును ఆశిస్తాడో అతడు పరిశుద్ధుడైన ఆయనతోనే మొర పెట్టుకోవాలి. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• تبرؤ الأتباع والمتبوعين بعضهم من بعض، لا يُعْفِي كلًّا من مسؤوليته.
అనుసరించేవారు,అనుసరించబడే వారు ఒకరి నుండి ఇంకొకరు విసుగు చెందటం ప్రతి ఒక్కరిని తమ బాధ్యతల నుండి మినహాయింపు కలిగించదు. info

• الترف مُبْعِد عن الإذعان للحق والانقياد له.
విలాసము సత్యమును అంగీకరించటం నుండి,దానికి విధేయత చూపటం నుండి దూరంగా ఉంచుతుంది. info

• المؤمن ينفعه ماله وولده، والكافر لا ينتفع بهما.
విశ్వాసపరుడిని అతని సంపద,అతని సంతానము ప్రయోజనం చేకూరుస్తుంది. మరియు అవిశ్వాసపరుడు వాటితో ప్రయోజనం చెందడు. info

• الإنفاق في سبيل الله يؤدي إلى إخلاف المال في الدنيا، والجزاء الحسن في الآخرة.
అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం ఇహలోకములో సంపద రెట్టింపు అవటానికి,పరలోకములో మంచి ప్రతిఫలమునకు దారితీస్తుంది. info